ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చాలి
ABN , Publish Date - Apr 04 , 2026 | 11:21 PM
జిల్లాలో ప్రజారోగ్యంపై చర్యలు తీసుకొని ప్రజా రోగ్యాన్ని మెరుగుపర చాలని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పేర్కొన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి
కర్నూలు లీగల్, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రజారోగ్యంపై చర్యలు తీసుకొని ప్రజా రోగ్యాన్ని మెరుగుపర చాలని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి పేర్కొన్నారు. శనివారం డీఎం హెచ్‌వో కామేశ్వర్‌ప్రసాద్ లోక్ అదాలత్ కార్యాలయంలో లీలా వెంకట శేషాద్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రజల్లో ఆరోగ్య సమస్యపై అవగాహన కల్పించేలా గ్రామాల్లో సదస్సులు ఏర్పాటు చేయా లని లీలా వెంకటశేషాద్రి డీఎంహెచ్‌వోను కోరారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 7న జరగబోయే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా జిల్లాలోని విలేజ్ అర్బన్ సెంటర్లలో ప్రజా రోగ్యానికి సంబంధించి ప్రచారం చేయాలని అన్నారు. వైద్యసదుపాయం లేని గ్రామాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు వైద్యపరీక్షలు తీర్చేందుకు కృషి చేయాలన్నారు.