Share News

ప్రజలు పెట్టిన భిక్షే మంత్రి పదవి

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:29 AM

నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి పెట్టిన భిక్ష వల్లనే తనకు మంత్రి పదవి లభించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కోవెలకుంట్ల పట్టణంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. సంతపేట, సంతమార్కెట్‌, అయ్యప్ప స్వామి దేవాలయం వీధి, ఇందిరమ్మ కాలనీ, సరస్వతీదేవి ఆలయ కాలనీలలో రూ 2.81 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి ప్రారంభించారు.

ప్రజలు పెట్టిన భిక్షే మంత్రి పదవి
కోవెలకుంట్లలో రోడ్లను ప్రారంభిస్తున్న మంత్రి

కాటసానీ.. కాస్త ఓపిక పట్టు .. 2029లో చూసుకుందాం

రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

కోవెలకుంట్ల, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి పెట్టిన భిక్ష వల్లనే తనకు మంత్రి పదవి లభించిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కోవెలకుంట్ల పట్టణంలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. సంతపేట, సంతమార్కెట్‌, అయ్యప్ప స్వామి దేవాలయం వీధి, ఇందిరమ్మ కాలనీ, సరస్వతీదేవి ఆలయ కాలనీలలో రూ 2.81 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లను మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ రెండేళ్ల పాలనకు సంబంధిచిన కరపత్రాలను అందజేశారు. సంతపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి బీసీ మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి ఎంతో కృషి చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వంలో నిర్వహించిన డీఎస్సీ నియామకంలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నాయకులు నిరసనలు, దీక్షలు చేపడుతుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. అయితే వారు చేపట్టే కార్యక్రమాల్లో విద్యార్థులు ఎక్కడా కనిపించడం లేదని, కేవలం ఆ పార్టీ శ్రేణులే కనిపిస్తున్నారని అన్నారు. కోవెలకుంట్లలో తాగునీటి సమస్య ఉందని, ప్రజలు తన దృష్టికి తేస్తే తన సొంత నిధులతో పట్టణంలో 8చోట్ల బోరు వేయించగా, అందులో ఐదు చోట్ల నీరు సమృద్ధి పడ్డాయన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నుంచి రైల్వే బ్రిడ్జి వరకు రూ.8 కోట్లతో నూతనంగా సీసీ రోడ్డు వేయించామని చెప్పారు. కాటసాని కాస్తా ఓపిక పట్టుకో.. 2029 ఎన్నికల పోటీలో నిలబడి తాను గెలిచి సత్తా చూపిస్తానన్నారు. కార్యక్రమంలో కోవెలకుంట్ల సొసైటీ చైర్మన్‌ గువ్వల సుబ్బారెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ మాజీ చైర్మన్‌ గడ్డం నాగేశ్వర్‌రెడ్డి, గడ్డం అమర్నాథ్‌ రెడ్డి, టీడీపీ నాయకులు సౌదరదిన్నె సుబ్బారెడ్డి, ధనుంజయుడు, జగదీశ్వర్‌ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, హుస్సేనయ్య, నరసింహా రెడ్డి, రాజశేఖర్‌, వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:29 AM