ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం తగదు
ABN , Publish Date - May 25 , 2026 | 10:51 PM
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని, చట్టపరిధిలోని సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలిన ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు.
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల క్రైమ్, మే 25 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని, చట్టపరిధిలోని సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలిన ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. పట్టణంలోని జిల్లా పోలీసు కార్యాల యంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీ స్వయంగా పాల్గొని ఫిర్యాదిదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదు లపై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి సమస్యను పరిష్క రించేందుకు కృషి చేస్తామని ఫిర్యాదిదారులకు భరోసా కల్పిం చారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా నిర్ణీత గడు వులోగా పరిష్కారం చూపాలని పోలీసు అధికారులకు సూచిం చారు. పీజీఆర్‌ఎస్‌లో వివిధ ప్రాంతాలకు చెందిన ఫిర్యాది దారులు వివిధ సమస్యలపై అధికారులకు 122 వినతిపత్రాలు అందజేశారు.