ప్రజా ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించాలి
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:22 PM
ప్రజా ఫిర్యా దులను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి) : ప్రజా ఫిర్యా దులను వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో 2797 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. అలాగే రీ ఓపెన్ అయిన 293 దరఖాస్తులను నాణ్యతతో పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ఆడిట్ కేసులను కూడా త్వరితగతిన పరిష్కరించాలన్నారు. మొత్తం పీజీఆర్‌ఎస్ ద్వారా 240 దరఖాస్తులు, రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 138 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అంతకముందు అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ ప్రియాంక, డీఆర్వో రామునాయక్, మున్సిపల్ కమిషనర్ శేషన్న తదితరులు పాల్గొన్నారు.