ప్లాస్టిక్ సర్జరీపై ప్రజల్లో అవగాహన పెరగాలి
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:24 PM
ప్లాస్టిక్ సర్జరీ వైద్యం పై ప్రజల్లో అవగాహన పెరగాల ని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.కె.చిట్టినరసమ్మ అన్నార.
కర్నూలు హాస్పిటల్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ సర్జరీ వైద్యం పై ప్రజల్లో అవగాహన పెరగాల ని కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా.కె.చిట్టినరసమ్మ అన్నార. జాతీయ ప్లాస్టిక్ సర్జరీ డే ను పురస్కరించుకుని ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలో వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహిం చారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు ప్లాస్టిక్ సర్జరీ విభా గం కీలకంగా మారిందని, ముఖ్యంగా ఇటీవల కాలంలో రోగుల సంఖ్య కూడా పెరిగిందన్నారు. కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ డా.కె.వెంక టేశ్వర్లు మాట్లాడుతూ సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందని, ఇటీవల ప్లాస్టిక్ సర్జరీలో రోడ్డు ప్రమాదాలు, క్యాన్సర్ రోగులకు ఆపరేషన్ల ద్వారా కొత్త జీవితాన్ని ప్రసాదిస్తూన్నారని అన్నారు. ఇటీవల కాలంలో ప్లాస్టిక్ సర్జరీ విభాగానికి రోగుల సంఖ్య పెరిగిందని, ఏడాదికి 4వేల మంది రోగులు ఓపీకి వస్తున్నారని తెలిపారు. అంతకుముందు కర్నూలు మెడికల్ కాఏలజీ ఆవర ణంలోని శుశృతుడు విగ్రహానికి ప్రిన్సిపాల్, హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్లాస్టిక్ సర్జరీ విభాగం హెచ్‌వోడీ డా.మంజులబాయి, ప్రొ.డా.రాజా రవికుమార్, సీనియర్ ప్లాస్టిక్ సర్జన్ డా.భానుమూర్తి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.