కేసుల నిరూపణ అత్యంత కీలకం
ABN , Publish Date - May 22 , 2026 | 11:22 PM
సమాజంలో నేరాల శాతం తగ్గడానికి, బాధితులకు న్యాయం జరగాలన్నా కోర్టుల్లో కేసుల నిరూపణ అత్యంత కీలకమని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.యుగం ధర్ బాబు పేర్కొన్నారు.
ఏఎస్పీ యుగంధర్‌బాబు
నంద్యాల క్రైమ్, మే 22 (ఆంధ్రజ్యోతి): సమాజంలో నేరాల శాతం తగ్గడానికి, బాధితులకు న్యాయం జరగాలన్నా కోర్టుల్లో కేసుల నిరూపణ అత్యంత కీలకమని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) ఎన్.యుగం ధర్ బాబు పేర్కొన్నారు. నంద్యాల సబ్‌డివిజన్ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్లు, కోర్టుల్లో పెండింగ్ కేసులు, నిందితులకు శిక్ష పడేలా చేయ డంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్రపై శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరస్తులకు శిక్షపడేలా కేసుల దర్యాప్తు చేపట్టాలన్నారు. ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి రివార్డులు ఇస్తామని అన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ ఎం. జావళి అల్ఫోన్స్, కోర్టు మానిటరింగ్ సెల్, నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.