Share News

కూలీలందరికీ పనులు కల్పిస్తాం

ABN , Publish Date - Jan 04 , 2026 | 12:50 AM

వ్యవసాయ కూలీలందరికీ పనులు కల్పిస్తామని, ఎవరూ కూడా వలసలు వెళ్లవద్దని ఉపాధి హామీ పథకం పీడీ వెంకట్రామయ్య అన్నారు.

కూలీలందరికీ పనులు కల్పిస్తాం
సామాజిక తనిఖీలో విచారణ చేస్తున్న పీడీ వెంకట్రామయ్య

ఎవరూ కూడా వలసలు వెళ్లవద్దు

ఉపాధి హామీ పథకం పీడీ వెంకట్రామయ్య

మద్దికెర, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ కూలీలందరికీ పనులు కల్పిస్తామని, ఎవరూ కూడా వలసలు వెళ్లవద్దని ఉపాధి హామీ పథకం పీడీ వెంకట్రామయ్య అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ముందు సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమానికి డీవీవో షకీలాబేగంతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ మండలంలో మొత్తం 11 గ్రామాల్లో 7వేల మంది కూలీలకు 1,175 పనులకు గానూ రూ.10కోట్లు ఖర్చు పెట్టామన్నారు. సీసీ రోడ్లు, భవనాలు కింద రూ.3.40 కోట్లు ఖర్చు చేశామన్నారు. మొత్తం ఉపాధి హామీ కింద 2024-25కు రూ.13.40 కోట్లను ఖర్చు చేసినట్లు తెలిపారు. 8,396 జాబ్‌కార్డులు ఉండగా 7,291 మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించామన్నారు. 11 గ్రామాల్లో మొక్కలు నాటి కనపడకుండా పోయాయని, అందువల్ల రూ.5.96లక్షలు విలువ చేసే పనుల మొక్కలు నాటారని, ఆ మొక్కలు చనిపోవడం వల్ల ఆ మొత్తానికి చెందిన విలువ గల మొక్కలు తిరిగి నాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏపీడీ లక్ష్మన్న, ఎస్‌ఆర్‌బీ కాంతయ్య, జడ్పీటీసీ సభ్యులు మురళిధర్‌ రెడ్డి, ఎంపీపీ అనిత యాదవ్‌, సర్పంచ్‌ సుహాసిని, ఉప సర్పంచ్‌ కృష్ణ, ఎంపీడీవో కొండయ్య, ఏపీవో నర్సిరెడ్డి, ఫీల్డ్‌, టెక్నికల్‌ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 04 , 2026 | 12:50 AM