పారదర్శక సేవలు అందించండి
ABN , Publish Date - May 26 , 2026 | 11:17 PM
ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని, వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారు లకు సూచించారు.
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల నూనెపల్లి, మే 26 (ఆంధ్రజ్యోతి) : ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని, వారితో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారు లకు సూచించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, డీఎల్‌డీఓలు, ఎస్‌జీఎస్ డబ్ల్యూ మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వ సేవలందించే ప్రతిస్థాయిలో బాధ్యతాయుత వ్యవహారం కనిపిం చాలని అన్నారు. ముఖ్యంగా స్వర్ణగ్రామ-స్వర్ణవార్డు కేంద్రాలలో సిబ్బంది పనితీరుపై ప్రజల అభిప్రాయాలను క్రమం తప్పకుండా సేకరించాలన్నారు.
అక్షరాస్యతను విజయవంతం చేయండి
జిల్లాలో అక్షరాస్యత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో ఇంకా 2.24 లక్షల మంది నిరక్షరాస్యులున్నారన్నారు. ఈ ఏడాది 1.12 లక్షల మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేయాలన్నారు. మే 28 నుంచి జూన్ 28 వరకు లెర్నర్స్ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేసి, వలంటీర్లకు లెర్నర్లను కేటాయించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి, డబ్ల్యూఎంఏ ప్రాజెక్టు డైరెక్టర్ సూర్యనారాయణ, డిప్యూటీ సీఈఓ సుబ్బారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి లలితాబాయి పాల్గొన్నారు.