కక్షిదారులకు సత్వర న్యాయం అందించండి
ABN , Publish Date - May 26 , 2026 | 11:21 PM
కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు లీగల్ ఎయిడ్ ప్యానెల్ లాయర్లు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. స్థానిక న్యాయ సేవాసదన్ భవన్‌లో లీగల్ ఎయిడ్ ప్యానెల్ లాయర్ల విధులపై మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి
కర్నూలు లీగల్, మే 26 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు లీగల్ ఎయిడ్ ప్యానెల్ లాయర్లు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. స్థానిక న్యాయ సేవాసదన్ భవన్‌లో లీగల్ ఎయిడ్ ప్యానెల్ లాయర్ల విధులపై మంగళవారం రివ్యూ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కక్షిదారులకు కోర్టులకు మధ్య ప్యానెల్ లాయర్లు అనుసంధానకర్తగా ఉంటూ వారికి అన్ని విదాలా న్యాయ సహాయాన్ని ఉచితంగా అందించాలన్నారు. మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి పి. కమలాదేవి ప్యానల్ లాయర్లకు వారి చట్టపరమైన అధికారాలు బాధ్యతల విషయంపై అవగాహన కల్పించారు. కేసుల పరిష్కారంలో పాటించాల్సిన మెలకువలను ఆయన వివరించారు కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రరావు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సులోచన, సీనియర్ న్యాయవాది మురళి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.