Share News

నేరుగా పరిష్కార పత్రాలివ్వండి

ABN , Publish Date - May 29 , 2026 | 11:43 PM

ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి వినతినీ జాప్యం లేకుండా పరిష్కరించి నేరుగా పరిష్కార పత్రాలు అందజేయాలని కలెక్టర్‌ రాజకుమారి ఆధికారులను ఆదేశించారు.

నేరుగా పరిష్కార పత్రాలివ్వండి
అర్జీలను స్వీకరిస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్‌

కలెక్టర్‌ ఆదేశం

ఆళ్లగడ్డ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సమస్యల వెల్లువ

ఆళ్లగడ్డ, మే 29 (ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి స్వీకరించిన ప్రతి వినతినీ జాప్యం లేకుండా పరిష్కరించి నేరుగా పరిష్కార పత్రాలు అందజేయాలని కలెక్టర్‌ రాజకుమారి ఆధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన మూడో విడత ప్రత్యేక ప్రజాసమస్యల పరిష్కార వేదికకు ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి తమ సమస్యలను విన్నవించుకొన్నారు. కలెక్టర్‌ రాజకుమారి తోపాటు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, జాయింట్‌ కలెక్టర్‌ సూరజ్‌ ధనుంజయ్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుండి నేరుగా వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వన్‌ మంత్‌ ఫోర్‌ విజిట్‌ కార్యక్రమంలో భాగంగా మొదటి వారం 578, రెండో వారంలో 524 ఫిర్యాదులు అందగా ఈ వారం 400 ఫిర్యాదులు నమోదయ్యాయని తెలిపారు. మొత్తం మూడు వారాల్లో 1500 వరకు వినతులు అందా యన్నారు. ఇప్పటికే 400 సమస్యలను పరిష్కరించామని అన్నారు. జాప్యం లేకుండా సమస్యలు పరిష్కరించి దరఖాస్తుదారులకు పరిష్కార పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులకు ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకోనిరావాలని అన్నారు. కార్యక్రమంలో ఆర్‌డీవో విశ్వనాథ్‌, వివిధ శాఖల జిల్లా, మండల, గ్రామ స్ధాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2026 | 11:43 PM