Share News

బాలికలకు సామాజిక భద్రత కల్పించండి

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:34 PM

బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు సామాజిక భద్రతను కల్పించాల్సిన బాఽధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు.

బాలికలకు సామాజిక భద్రత కల్పించండి
మాట్లాడుతున్న బి.లీలా వెంకట శేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి

కర్నూలు లీగల్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): బాలికలకు నాణ్యమైన విద్యతో పాటు సామాజిక భద్రతను కల్పించాల్సిన బాఽధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి తెలిపారు. శనివారం జాతీయ బాలిక దినోత్సవంల్లో భాగంగా స్థానిక బి.క్యాంపులోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో శనివారం జరిగిన ఓకార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాలికలపై వివక్ష, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థలు సమా జంలో ఉన్నంత కాలం బాలికల పట్ల వివక్షత ఉంటుందని వాటిని రూపుమాపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. మహిళ ఎస్‌ఐ విజయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు, బాలికలు, పిల్లల రక్షణకు అనేక చట్టాలు ఉన్నాయని, ‘భేటీ బచావో.. భేటీ పడావో.. వంటి ప్రభుత్వ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. బాలికల హక్కుల పరిరక్షణకు సంబంధించిన పోస్టర్‌ను బి.లీలా వెంకటశేషాద్రి ఆవిష్కరిం చారు. కార్యక్రమంలో డీసీపీవో శారద, ప్రోగ్రాం ఆఫీసర్‌ సుమలత, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సూపరింటెండెంట్‌ మునిచంద్ర, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ మెంబర్‌ రమణయ్య, లీగల్‌ ఎయిడ్‌ మెంబర్‌ డా.రాయపాటి శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 11:34 PM