Share News

సురక్షిత తాగునీరు సరఫరా చేయండి

ABN , Publish Date - Apr 21 , 2026 | 10:59 PM

ప్రజలకు సురక్షిత మైన తాగునీటిని సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారు లకు కలెక్టర్‌ డా. సిరి ఆదేశించారు.

సురక్షిత తాగునీరు సరఫరా చేయండి
కొత్తపల్లి తాగునీటి పథకం వద్ద ఫిల్టర్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌

కలెక్టర్‌ డా.ఏ. సిరి

పత్తికొండ, ఏప్రిల్‌ 21. (ఆంధ్రజ్యోతి): ప్రజలకు సురక్షిత మైన తాగునీటిని సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారు లకు కలెక్టర్‌ డా. సిరి ఆదేశించారు. మంగళవారం మండలంలోని కొత ్తపల్లి తాగునీటి పథకాన్ని ఆమె తనిఖీ చేశారు. పందికోన రిజర్వాయర్‌ నుంచి నీటిని తాగునీటిగా ఫిల్టర్‌చేసే మైక్రోఫిల్టర్‌ హౌస్‌, క్లోరినేషన్‌ కేంద్రంలో తాగునీటి శుద్ధిపక్రియ, నీటినాణ్యత పరీక్షల నిర్వహణను కలెక్టర్‌ పరిశీలించారు. నిర్వహణ లోపాలపై అఽధికారులకు సూచనలు అందించారు. పందికోన రిజర్వాయర్‌ లో నీటినిల్వలను గురించి ఆర్‌డబ్యూఎస్‌ అధికారులను అడిగి తెలు సుకున్నారు. ఆమె మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి రాకండి చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 33 సమగ్ర మంచినీటిపధకాలు (సీపీడబ్ల్యూ), 800 రక్షిత మంచినీటి పథకాలు(పీడబ్ల్యూఎస్‌), 1,200 వినీ పీడబ్ల్యూఎస్‌ మంచినీటి పధకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. 300 బోర్లద్వారా నడిచే నీటిపథకాలు, 1000 చేతిపంపులు ఉన్నాయని అన్నారు. ఎస్‌డీఎస్‌ పథకం కింద 53పనులు మంజూరయ్యా యని, త్వరలో ఆపనులు ప్రారంభిస్తామన్నారు. పట్టణం లోని మార్కెట్‌ వద్ద ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకును కలెక్టర్‌ పరిశీలిం చారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ఈ మనోహర్‌, ఆర్డీవో మధుసూదన్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ డిఈ శేషాద్రి, ఆర్‌ఐ శ్రీనివాసులు, ఎంపిడీవో కవిత, డిప్యూటి ఎంపిడివో నరసింహులు ఉన్నారు.

Updated Date - Apr 21 , 2026 | 10:59 PM