నాణ్యమైన సేవలు అందించండి
ABN , Publish Date - May 19 , 2026 | 11:19 PM
పేద రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు.
జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ
సంజామల, మే 19 (ఆంధ్రజ్యోతి) : పేద రోగులకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ వైద్య ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం సంజామల పీహెచ్‌సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. మందులు, వార్డులు పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 16న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంజామల పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ శుభ్రత లేకపోవడంతో ఆగ్రహించారు. స్వీపర్లు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో ఆ రోజు సమస్య ఏర్పడిందని డాక్టర్ సులేమాన్ వివరించారు. వెంటనే వారి డిప్యూటేషన్‌ను రద్దు చేసి స్థానిక పీహెచ్‌సీలోనే విధులు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేశారు.