Share News

సత్వర న్యాయం అందించండి

ABN , Publish Date - Oct 16 , 2026 | 12:08 AM

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదైన హిట్‌ అండ్‌ రన్‌ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయ చేయాల ని జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) వాసు అధికారులను ఆదేశించారు.

సత్వర న్యాయం అందించండి
ఆన్‌లైన్‌ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి పి.వాసు, బి.లీలా వెంకట శేషాద్రి

కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి పి.వాసు

కర్నూలు లీగల్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదైన హిట్‌ అండ్‌ రన్‌ కేసులను త్వరగా పరిష్కరించి బాధితులకు సత్వర న్యాయ చేయాల ని జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) వాసు అధికారులను ఆదేశించారు. గురు వారం స్థానిక జిల్లా కోర్టులో జరిగిన ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ పద్ధతిలో ఆయన అధికా రులనుద్దేశించి మాట్లాడారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుల విచారణ ప్రక్రియకు సంబంధించి అధికారులు జిల్లాస్థాయి కమిటీలతో సమన్వయం చేసుకొని కేసుల్లో క్లయిమ్‌లు వేగవంతమైన ప్రక్రియ ద్వారా పరిష్కరించాలని ఆయన సూచించారు. బాధితుల క్లయిమ్‌లను ఇన్సూరెన్స్‌ కంపెనీలకు సమర్పించడానికి రెవెన్యూ, పోలీసు అధికారులు కృషి చేయాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని అండర్‌ ట్రయల్‌ ఖైదీలకు సత్వర న్యాయం అందించడానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి, పలువురు జిల్లాస్థాయి అధికారులు, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ శివరామచంద్రరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2026 | 12:08 AM