Share News

పౌష్టికాహారం అందించండి

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:18 AM

జిల్లాల్లో ప్రతి అంగనవాడీ కేంద్రంలో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయ అన్నారు.

పౌష్టికాహారం అందించండి
మాట్లాడుతున్న పీడీ విజయ

ఐసీడీఎస్‌ పీడీ విజయ

కర్నూలు రూరల్‌, సెప్టెంబరు 18(ఆంద్రజ్యోతి): జిల్లాల్లో ప్రతి అంగనవాడీ కేంద్రంలో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించాలని ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ విజయ అన్నారు. కర్నూలు రూరల్‌ మండలంలోని అంగనవాడీ కేంద్రాల్లో పోషణ మాసం వేడుకల్లో భాగంగా రెండో థీమ్‌పై శుక్రవారం స్థానిక జిల్లా పరిషత్‌ ఆవరణలో ఎంపీపీ హాల్‌లో అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈసమావేశానికి పీడీ హాజరై మాట్లాడారు. పౌష్టికాహారం అందించే సమయంలో ఆయా లు, అంగనవాడీ టీచర్లు పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఈ సమా వేశంలో అంగనవాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

Updated Date - Sep 19 , 2026 | 12:18 AM