Share News

పౌష్టికాహారం అందించండి

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:29 PM

చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన పౌష్టికాహారాన్ని సంపూ ర్ణంగా అందించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణా కమిషన్‌ చైర్మెన్‌ వేటుకూరి సూర్యనారాయణ రాజు అధికారులకు సూచిం చారు.

పౌష్టికాహారం అందించండి
సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటిస్తున్న చైర్మెన్‌

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మెన్‌

శ్రీశైలం, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యంగా ఎదగడానికి అవసరమైన పౌష్టికాహారాన్ని సంపూ ర్ణంగా అందించాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణా కమిషన్‌ చైర్మెన్‌ వేటుకూరి సూర్యనారాయణ రాజు అధికారులకు సూచిం చారు. సోమవారం శ్రీశైల క్షేత్రం చేరుకున్న ఆయన స్వామి, అమ్మవార్లను అలంకార దర్శనం చేసుకుని మండల పరిధిలో విస్తృత పర్యటన చేశారు. కమిషన్‌ సభ్యులు మధుసూదన్‌రావు, డీసీపీవో స్వప్న ప్రియదర్శిని, నోడల్‌ ఆఫీసర్‌ ఉమామహేశ్వరమ్మ, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ అంజలీదేవిలతో కలిసి సున్నిపెంట ఎస్సీ, ఎస్టీ, బీసి గురుకుల పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను పర్య టించారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి గర్భిణిలకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలు సుకున్నారు. మాతా శిశువులకు ఎప్పటికప్పుడు ఇవ్వవలసిన సూది మందులు టీకాలను సకాలంలో ఇచ్చేలా జాగ్రత్తలు తీసు కోవాలని వైద్యులను సూచించారు. అనంతరం శ్రీశైలంలోని మేకల బండ చెంచు గూడెంలోని అంగన్‌వాడి కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు ఆటపాటలతో కూడిన విద్యాబోధనకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు.

Updated Date - Jun 29 , 2026 | 11:29 PM