Share News

సాగునీరు అందించి ఆదుకోండి

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:45 PM

ప్రస్తుతం రబీలో వేసిన పంటలు ఎండిపో తున్నాయని, సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

సాగునీరు అందించి ఆదుకోండి
పంటలకు సాగునీరు అందించాలని కోరుతున్న రైతులు

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి రైతుల వినతి

బనగానపల్లె, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం రబీలో వేసిన పంటలు ఎండిపో తున్నాయని, సాగునీరు అందించి ఆదుకోవాలని రైతులు ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం బనగానపల్లె నియోజకవర్గంతో పాటు జిల్లాలోని వివిధ గ్రామాల ప్రజలు మంత్రి బీసీని కలసి పలు సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రాలు సమర్పించారు. ప్రతి సమస్యను మంత్రి సావధానంగా విని సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీఇచ్చారు. కోవెలకుంట్ల, బనగానపల్లె మండలాలకు చెందిన పలువురు రైతులు సాగు నీటి ఎద్దడి నేపథ్యంలో పంటలకు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సాగునీటి విడుదలకు సంబంధిత అధికా రులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని రైతులకు మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మంత్రి బీసీ తెలిపారు.

Updated Date - Nov 06 , 2026 | 11:45 PM