ఫిర్యాదులకు తక్షణ పరిష్కారం చూపండి
ABN , Publish Date - Apr 13 , 2026 | 11:21 PM
వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరిధిలో తక్షణ పరిష్కారం చూపాలని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు.
ఎస్పీ సునీల్ షెరాన్
నంద్యాల క్రైం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను విచారించి చట్టపరిధిలో తక్షణ పరిష్కారం చూపాలని ఎస్పీ సునీల్ షెరాన్ సూచించారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా నిర్ణీత గడువు లోగా సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై ప్రజల నుంచి 95 ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదీదారులతో ఎస్పీ స్వయంగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పై పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. ఫిర్యాదీదారులతో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అధికారులను ఆదేశించారు.