ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలి
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:28 AM
కర్నూలు సిటీ రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్ కేంద్ర రైల్వేశాఖను డిమాండ్ చేశారు. 2026-27లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కర్నూలు రైల్వేశాఖకు అత్యధిక నిధులు కేటాయించాలన్నారు.
హైదరాబాద్‌లో రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు వినతి
కర్నూలు రూరల్ జనవరి 28(ఆంధ్రజ్యోతి): కర్నూలు సిటీ రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్ కేంద్ర రైల్వేశాఖను డిమాండ్ చేశారు. 2026-27లో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో కర్నూలు రైల్వేశాఖకు అత్యధిక నిధులు కేటాయించాలన్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని రైల్వే నిలయంలో ఆశాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సత్యప్రకా్‌షకు సీపీఎం, సీపీఐ, అవాజ్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని అమరావతికి వెళ్లడానికి ఒక్క రైలును కూడ కేటాయించలేదని ఆరోపించారు. దీనిపై అనేకసార్లు విన్నవించిన పాలకులకు ఏమాత్రం పట్టించుకోవడంలేదన్నారు. రైల్వే అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు వినతిపత్ర సమర్పించిన వారిలో నాయకులు రాముడు, రాజశేఖర్, జబ్బర్‌మౌలాన తదితరులు ఉన్నారు.