ప్రజలకు మెరుగైన సేవలందించండి
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:45 AM
రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఏ.సిరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ సిరి
కర్నూలు కలెక్టరేట్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ ఏ.సిరి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స హాలులో రెవెన్యూ అంశాలపై ఆర్డీవోలు, తహసీల్దార్లు, రీసర్వే డిప్యూ టీ తహసీల్దార్లతో జిల్లా స్థాయి వర్క్‌షాపు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రీసర్వే, 22ఏ దరఖాస్తులను త్వరి తగతిన పరిష్కరించాలన్నారు. ఇప్పటి వరకు 22ఏ కింద దాదాపు 3వేల కేసులను పూర్తి చేసినప్పటికీ వెబ్‌ల్యాండ్ 2.0లో అవసరమైన మార్పులు చేయాల్సి ఉన్నందున తదుపరి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. శనివారం నాటికి తహసీల్దార్లు అందరూ జేసీ అను మతి కోసం సంబంధిత ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. రీసర్వే లో ఇప్పటి వరకు 286 గ్రామాల్లో ప్రక్రియ పూర్తయిందని, సుమారు 2 లక్షల పాసు పుస్తకాలను పంపిణీ చేశామన్నారు. మిగిలిన 150కి పైగా గ్రామాల్లో రీసర్వే ప్రక్రియను మార్చి నాటికి పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. రీసర్వేకి సంబంధించి ఫేజ్-4లో తహసీల్దార్ లాగినలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ అధికారులు పాల్గొన్నారు.