Share News

మెరుగైన వసతులు కల్పించండి

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:00 AM

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించేం దుకు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్‌ పీడీ పి.విజయ సిబ్బందిని ఆదేశించారు.

మెరుగైన వసతులు కల్పించండి
బుధవారపేటలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న పీడీ

ఐసీడీఎస్‌ పీడీ విజయ

కర్నూలు రాజ్‌విహార్‌ సర్కిల్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించేం దుకు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్‌ పీడీ పి.విజయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం స్థానిక బుధవారపేట పరిధిలోని అంగన వాడీ కేంద్రం 4, 12లను ఆమె తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం, సమయపాలన, సౌకర్యాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పిల్లల వయస్సుకు అనుగుణంగా వారి గ్రాహకశక్తిని అనుసరించి ఆటపాటల ద్వారా అభ్యసన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 12:00 AM