చెవిలో పువ్వుతో నిరసన
ABN , Publish Date - Sep 02 , 2026 | 11:26 PM
తమను క్రమ బద్ధీకరించాలని కోరుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కాంట్రాక్టు అండ్ హెల్త్ ఉద్యోగులు చెవిలో పువ్వు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు.
11వ రోజుకు చేరిన మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): తమను క్రమ బద్ధీకరించాలని కోరుతూ కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో కాంట్రాక్టు అండ్ హెల్త్ ఉద్యోగులు చెవిలో పువ్వు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. బుధవారం మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరింది. మధ్యాహ్నం కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఎంసీహెచ్ సర్కిల్‌లో కాంట్రాక్టు ఉద్యోగులు మానవహారం నిర్వహించారు. అనంతరం మాతా సంరక్షణ కేంద్రం ఎదుట చెవిలో పువ్వు పెట్టుకుని నినాదాలు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకునే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఆన్‌లైన్ రిపోర్టులు ఇప్పటికే నిలుపుదల చేశామని తెలిపారు. బుధవారం నుంచి రిజిస్టర్లు రాయకుండా పెన్‌డౌన్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు జేఏసీ నాయకులు స్టాఫ్ నర్సు పుష్ప, ఎల్‌టీలు శాంతి, శ్రీదుర్గ, ఫార్మాసిస్టు, వెంకటేశ్, నాగేంద్ర, నగేష్ పాల్గొన్నారు.