గ్యాస్ కోసం ధర్నా
ABN , Publish Date - Mar 28 , 2026 | 11:35 PM
సకాలంలో గ్యాస్ అందించి ఆదుకోవాలని శనివారం జూపాడుబంగ్లాలోని కేజీరోడ్డుపై ఽగ్యాస్ వినియోగదారులు ధర్నా చేశారు.
జూపాడుబంగ్లా, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): సకాలంలో గ్యాస్ అందించి ఆదుకోవాలని శనివారం జూపాడుబంగ్లాలోని కేజీరోడ్డుపై ఽగ్యాస్ వినియోగదారులు ధర్నా చేశారు. గ్యాస్ సిలిండర్లు తీసుకొస్తున్నారన్న సమాచారంతో 20 రోజుల కిందట బుకింగ్ చేసుకున్న వినియోగదారులు అధికసంఖ్యలో ఎంపీడీవో కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. గ్యాస్ సిలీండర్లు తీసుకొచ్చిన రెండు ఆటోలను చుట్టుముట్టారు. దీంతో ఆగకుండా కేజీరోడ్డుపై ఖాళీ సిలిండర్లతో ఆందోళన చేశారు. 13వతేదీ లోపల బుకింగ్ చేసుకున్నవారికి మాత్రమే గ్యాస్ అందజేస్తామని, మిగతావారికి రెండురోజుల తర్వాత ఇస్తామని చెప్పడంతో ఆ తర్వాత బుక్ చేసుకున్నవారంతా వెళ్లిపోయారు.