తాడుతో ఆటోను లాగుతూ నిరసన
ABN , Publish Date - May 17 , 2026 | 12:12 AM
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం నాయకులు తాడుతో ఆటోను లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. శనివారం పాతబస్టాండు నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు
డోన్ రూరల్, మే 16 (ఆంధ్రజ్యోతి): పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం నాయకులు తాడుతో ఆటోను లాగుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. శనివారం పాతబస్టాండు నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. పట్టణ కార్యదర్శి నక్కి శ్రీకాంత్, నాగమద్దయ్య, చిన్న రెహిమాన్, షమీమ్ భేగమ్, నక్కి హరి మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు మోదీ ధరలు పెంచబోమని, చమురు నిల్వలు పుష్కళంగా ఉన్నాయనీ నమ్మబలికి ఇప్పుడు ధరలు పెంచారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతుల్లో ప్రధాని కీలుబొమ్మగా మారి సంక్షోభానికి కారణమయ్యారని ఆరోపించారు. శేఖర్ మద్దిలేటి, శ్రీనివాసులు, గోపాల్ ఉన్నారు.