Share News

మొక్కలు నాటుతూ నిరసన

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:05 AM

వైద్యఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె 26వ రోజుకు చేరింది.

మొక్కలు నాటుతూ నిరసన
మొక్కలు నాటుతూ నిరసన తెలుపుతున్న కాంట్రాక్టు ఉద్యోగులు

26వ రోజుకు చేరిన కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): వైద్యఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మె 26వ రోజుకు చేరింది. శనివారం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో భోజన విరామ సమయంలో జేఏసీ సభ్యుడు ఈ.రమేష్‌గౌడు ఆధ్వర్యంలో ఏఆర్‌టీ సెంటర్‌ వద్ద మొక్కలు నాటుతూ నిరసన తెలిపారు. ఈసందర్భంగా రమేష్‌గౌడు మాట్లాడుతూ ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందించేటప్పుడు మా కష్టాలను మర్చిపోతామని, కానీ ప్రజలకు మంచి ఆరోగ్యం అందించే తాము చాలీచాలని వేతనా లతో కుటుంబాలు గడవని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేష్‌, ఆదోని ఉషా, ఉషాదేవి, రేఖా, వెంకటేశ, వినోద్‌, అశోక్‌, నరేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2026 | 12:05 AM