మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల నిరసన
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:31 PM
వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె 35వ రోజుకు చేరింది. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిపాలన విభాగం ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో జేఏసీ సభ్యుడు వినయ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు తమ అరచేతుల్లో డిమాండ్లు రాసి వినూత్న నిరసనకు దిగారు.
అరచేతుల్లో డిమాండ్లు రాసి...
35వ రోజుకు చేరిన సమ్మె
సంఘీభావం ప్రకటించిన ఏపీ హంసా
కర్నూలు హాస్పిటల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె 35వ రోజుకు చేరింది. సోమవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల పరిపాలన విభాగం ఎదుట మధ్యాహ్న భోజన సమయంలో జేఏసీ సభ్యుడు వినయ్ ఆధ్వర్యంలో కాంట్రాక్టు ఉద్యోగులు తమ అరచేతుల్లో డిమాండ్లు రాసి వినూత్న నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ తమ న్యాయమైన కోర్కెలైన రెగ్యులరైజేషన్, 100 శాతం గ్రాస్ వేతనం, సాధారణ బదిలీ సౌకర్యం, ఉద్యోగ భద్రత కోసం పోరాడుతున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మెకు ఏపీ హంసా యూనియన్ సిటీ అధ్యక్షుడు టి. గోవిందుస్వామి, కార్యదర్శి చక్రధర్, వైస్ ప్రెసిడెంట్ పి. సంపత్ కుమార్ సంఘీభావం ప్రకటించారు.