Share News

కర్నూలు జీజీహెచ్‌లో ఆందోళన

ABN , Publish Date - Jun 10 , 2026 | 11:22 PM

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం కార్మికులు ఆందోళన చేపట్టారు.

కర్నూలు జీజీహెచ్‌లో ఆందోళన
సూపరింటెండెంట్‌ ఆఫీసు ఆవరణలో బైఠాయించిన పారిశుధ్య కార్మికులు

సూపరింటెండెంట్‌ కార్యాలయం ముట్టడి

విధుల్లోకి తీసుకోవాలని కార్మికుల నిరసన

కర్నూలు హాస్పిటల్‌, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో బుధవారం కార్మికులు ఆందోళన చేపట్టారు. 50 ఏళ్లు పైబడిన పారిశుధ్య కార్మికులను, అక్రమంగా తొలగించిన కార్మికు లను విధుల్లో తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కార్మికులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ ఆఫీ సును ముట్టడించారు. కార్యాలయ ఆవరణంలో బైఠాయించి అక్రమంగా తొల గించిన కార్మికులను విధుల్లో తీసుకోవాలని, ఎంవోయు ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన వారిని వెంటనే డ్యూటీలో చేర్చుకోవాలని నినాదాలు చేశారు. సీఐటీయూ నగర ప్రధాన కార్యదర్శి విజయ రామాం జనేయులు మాట్లాడుతూ కర్నూలు జీజీహెచ్‌, మెడికల్‌ కాలేజీ, ఐ-హాస్పి టల్‌ క్యాన్సర్‌ హాస్పెటల్‌, నర్సింగ్‌ కాలేజీ, హాస్టల్స్‌లో పారిశుధ్య పనులు చేయించడానికి టెండర్‌ను దక్కించుకున్న పద్మావతి ఫెర్టిలిటీ ఏజెన్సీ 50 సంవత్సరాలు ఉన్న కార్మికులను చట్టవిరుద్ధంగా తొలగించిందన్నారు. 25 సంవత్సరాల నుంచి పని చేస్తున్న కార్మికులను అన్యాయంగా తొలగించడం రాజ్యాంగ విరుద్ధ్దమన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్‌ సంస్థలో 62 సంవత్సరాలకు రిటైర్మెంట్‌ జీవోలు ఉండగా.. ఇక్కడ మాత్రం 50 ఏళ్లు నిండిన వారిని తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. డీఎంఈతో చేసుకున్న అగ్రిమెంటు చట్టవిరుద్ధంగా ఉందన్నారు. అలాగే అక్రమంగా తొలగించిన కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. అనంతరం కొత్త రిక్రూట్‌మెంటులో ఏజెన్సీ మేనేజర్లు రాజు, వెంకటరమణ అవినీతికి పాల్పడ్డారని వారిపై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె. వెంకటేశ్వర్లుకు వినతి పత్రం అందజేశారు. ఏజెన్సీ యాజమాన్యంతో మాట్లాడి తొలగించిన కార్మికులను విధుల్లో తీసుకుంటామని హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ హామీ ఇవ్వడంతో కార్మికులు ఆందోళనను విరమించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నగర అధ్యక్షుడు అబ్దుల్‌ దేశాయ్‌, సీఐటీయూ నాయకులు ఆర్‌. కృష్ణ, సాల్మన్‌ రాజు, మాసూం, బజారి, లక్ష్మన్న, సుజాత, నగేష్‌, రంగన్న, శారదమ్మ, లక్ష్మిదేవి, చెన్నమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 11:22 PM