Share News

హెచ్‌పీవీ టీకాతో రక్షణ

ABN , Publish Date - Mar 11 , 2026 | 12:08 AM

14 15 సంవత్సరాల వయస్సుగల బాలికలు హెచ్‌పీవీ టీకా వేసుకుంటే భవిష్యత్తులో గర్భాశయ ముఖ క్యాన్సర్‌ రాకుండా నియంత్రించవచ్చని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసిసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు.

హెచ్‌పీవీ టీకాతో రక్షణ
హెచ్‌పీవీ టీకాను పరిశీలిస్తున్న మంత్రి టీజీ భరత్‌

పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు హాస్పిటల్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): 14 15 సంవత్సరాల వయస్సుగల బాలికలు హెచ్‌పీవీ టీకా వేసుకుంటే భవిష్యత్తులో గర్భాశయ ముఖ క్యాన్సర్‌ రాకుండా నియంత్రించవచ్చని పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసిసింగ్‌ శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని ఏ.క్యాంపు అర్బన్‌ హెల్త్‌ సెంట ర్‌లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివార ణకు ఏర్పాటు చేసిన హ్యూమెన్‌ పాపిలోమ వైరస్‌ (హెచ్‌పీవీ) టీకా ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం ఈ టీకాను ఉచితంగా అందజేస్తుందన్నారు. ఈ టీకాను అన్ని విదాలా పరీక్షలు జరిపి 96 శాతం సక్సెస్‌ రేటుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని 30వేల మందికి టీకాలు వేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌, డీఎంహెచ్‌వో డా.ఎల్‌. భాస్కర్‌, జిల్లా ఇమ్యూనేజేషన్‌ అధికారి డా. ఉమ, కార్పొరేటర్లు కైప పద్మావతి, విజయకుమారి, జాకీయాఅన్సారీ పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2026 | 12:08 AM