Share News

రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:34 AM

రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత
ప్రసంగిస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

కర్నూలు లీగల్‌, నవం బరు 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా న్యాయ సేవాధి కార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. గురువారం స్థానిక ప్రసూన న్యాయ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క న్యాయ విద్యార్థి రాజ్యాంగ హక్కులే కాకుండా బాధ్యతలను కూడా గుర్తించుకోవాలన్నారు. శాశ్వత లోక్‌అదాలత చైర్మన ఎం.వెంకట హరినాథ్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు పౌరులకు స్వేచ్ఛ సమానత్వం, గౌరవ ప్రదమైన జీవితాన్ని కల్పిస్తాయన్నారు. ప్రసూన న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌ డా.ఎం. శివాజీరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగంలో పేర్కొన్న రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రతిఒక్క లా విద్యార్థి కృషి చేయాలని కోరారు. లా విద్యార్థులతో లీలా వెంకట శేషాద్రి రాజ్యాంగ పీఠికను చదివించారు. లా కళాశాల డీన శివకుమార్‌, ప్రొఫెసర్లు రవూఫ్‌, మహఫూజ్‌ ఫాషా, మెహి ది హుశేన ఖాన, హేమలత, సునీత, మాలిక్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

జీజీహెచలో..

కర్నూలు హాస్పిటల్‌: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల న్యూడయోగ్నస్టిక్‌ బ్లాక్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఎస్‌ఆర్‌ఎంవో డా.పి. పద్మజ, హాస్పిటల్‌ అడ్మినిస్ర్టేషన అసిస్టెంట్‌ పొఫ్రెసర్‌ డా.ఎంవీ. కిరణ్‌ కుమార్‌ భారత రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర పోషించిన డా.బిఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలు వివరించారు. ఫెసిలిటీ మేనేజర్‌ శేఖర్‌, హెల్త్‌ ఇన్సపెక్టర్‌ టి.గోవిందు స్వామి, స్టాఫ్‌ నర్సులు పాల్గొన్నారు.

సీఐటీయూ ఆధ్వర్యంలో..

కర్నూలు న్యూసిటీ: రాజ్యాంగాన్ని రక్షించుకోవ డంతో పాటు కార్మికుల హక్కులను కాపడుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్‌ అన్నారు. గురువారం రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరిం చుకుని సీఐటీయూ అధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత నుంచి పాతబస్టాండు అంబేడ్కర్‌ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. గౌస్‌దేశాయ్‌ మాట్లా డుతూ రాజ్యాంగ పరిరక్షణ కోసం కార్మికులు పోరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాతబస్తీ కార్యదర్శి నరసింహులు, రాజశేఖర్‌, నగేష్‌, సాయిబాబా, అబ్దుల్‌ దేశాయ్‌ పాల్గొన్నారు.

రాయలసీమ యూనివర్సిటీలో..

కర్నూలు అర్బన: భారతీయ జీవన విధానాన్ని నిర్ధేశించే వాహిక భారత రాజ్యాంగమని ఆర్‌యూ ఉపకులపతి వి.వెంకటబసవరావు అన్నా రు. గురువారం రాయలసీమ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనం గా నిర్వహించారు. ఎనఎస్‌ఎస్‌ విభాగం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉపకులపతి మాట్లా డుతూ యువత సమాజ శ్రేయస్సుకు కృషి చేయాలన్నారు. రిజిసా్ట్రర్‌ విజ యకుమార్‌ నాయుడు, డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఫ డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ యూనివర్సిటీలో అంబేడ్కర్‌ విగ్రహానికి ఉపకులపతి పీఎస్‌ షావలి ఖాన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రాజ్యాంగాన్ని, విలువలను కాపాడుకుంటామంటూ ప్రతిజ్ఞ చేశారు. ఎన ఎస్‌ఎస్‌ అధికారి విద్యా గోదావరి, అధ్యాపకులు, విదార్థులు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో..

కర్నూలు ఎడ్యుకేషన: స్థానిక బి.క్యాంపు ప్రభుత్వ ఒకేషనల్‌ జూనియర్‌ కళాశాలలో గురువారం భారత రాజ్యాంగ దినోత్సవం ఘనం గా నిర్వహించారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి ప్రిన్సిపాల్‌ నాగస్వామి నాయక్‌, క్లస్టర్‌ యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగాధిపతి డా.జి.యల్లకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధ్యాపకులు మల్లికార్జున, విజయ శేఖర్‌, రామకృష్ణ, కృష్ణమోహన, సోమేష్‌, ఉల్గోజిరావు, చిన్న మల్లేశ్వరుడు, సారధిపటేల్‌, శ్రీధర్‌మూర్తి, ఇంతియాజ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 12:34 AM