డ్రైసోయింగ్‌తో పంట భూములకు రక్షణ
ABN , Publish Date - Apr 16 , 2026 | 11:31 PM
ప్రీమాన్సూన్ డ్రైసోయింగ్ విధానం రైతులు పాటించడంతో పంట భూములకు రక్షణ ఏర్పడుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి అన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి
గోనెగండ్ల, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ప్రీమాన్సూన్ డ్రైసోయింగ్ విధానం రైతులు పాటించడంతో పంట భూములకు రక్షణ ఏర్పడుతుందని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వరలక్ష్మి అన్నారు. గోనె గండ్లలోని పొలాల్లో గురువారం ఫ్రీమాన్సూన్ డ్రైసోయింగ్ విధానంపై రైతు ప్రదర్శనా కార్యక్ర మాన్ని ఏడీఏ మహుమ్మద్ ఖాద్రీ, అధికారులు చేపట్టారు. పలు రకాల విత్తనాలను కలిపి పొలం లో చల్లారు. రైతులకు పలు సూచనలు సూచిం చారు. ఆమె మాట్లాడుతూ తొలకరి వర్షాలు కురిసే ముందు భూమి ఎండ తీవ్రత ప్రభావం నుంచి రక్షించేందుకు ప్రీమాన్సూన్ డ్రైసోయింగ్ విధానం రైతులకు ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈ విధానం ద్వార పంట భూములు సహజసిద్దంగా సారవంతమవుతాయని తెలిపారు. ఈఏడాది ఎల్‌నిలో ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని, అందుకు గాను ఈపద్ధతి ఎంతో ఉపయోగం పడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఏఈవో రాజు, వీఏఏ రఘనాఽథ్‌యాదవ్, రైతులు పాల్గొన్నారు.