స్థలాలు కబ్జా కాకుండా కాపాడండి
ABN , Publish Date - Feb 24 , 2026 | 12:41 AM
పేదల స్థలాలను కబ్జా కాకుండా కాపాడాలని పట్టణ టీడీపీ అధ్యక్షుడు కె రామాంజనేయులు, సింగిల్‌విండో డైరెక్టర్ రేమట వెంకటేష్, టీడీపీ యువ నాయకుడు సృజన కోరారు.
రోడ్డుపై బైఠాయించిన కాలనీవాసులు
గూడూరు, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): పేదల స్థలాలను కబ్జా కాకుండా కాపాడాలని పట్టణ టీడీపీ అధ్యక్షుడు కె రామాంజనేయులు, సింగిల్‌విండో డైరెక్టర్ రేమట వెంకటేష్, టీడీపీ యువ నాయకుడు సృజన కోరారు. సోమవారం గూడూరు నగర పంచాయతీ కార్యాల యం ఎదుట వారు కాలనీవాసులతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్థలాలు లేని పేదల కోసం అర్హులైన ఒక్కోక్కరికి 2.5 సెంటు స్థలం మంజూరు చేసింది. ఆ లేఅవుట్‌లో పార్కు కోసం కోంత స్థలాన్ని కేటాయించారు. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కేడీసీసీ చైర్మన విష్ణువర్థన రెడ్డి సొంత నిధులు ఖర్చు చేసి ప్రభుత్వ లే అవుట్‌లో ముళ్లపోదలను తొలగించి శుభ్రం చేయిం చారు. 2019వ సంవత్సరం వైసీపీ నాయకులు కొంతమంది పేదల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. తక్షణం కబ్జాకు గురైన స్థలాన్ని కాపాడి పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు తహసీల్దార్ వెంకటేష్ నాయక్‌కు కాలనీవాసులు, టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. సర్వేయర్‌తో సర్వే నిర్వహించి హద్దులు చూపుతామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కౌన్సిలర్ కోడుమూరు షాషావలి, పట్ణణ తెలుగు యువత అధ్యక్షుడు వీర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నగర పంచాయతీ కార్యాలయంలో హైడ్రామా: నగర పంచాయతీ కార్యాలయంలో హైడ్రామా నడిచింది. పేదల స్థలం కబ్జా కాకుండా కాపాడాలని టీడీపీ నాయకులు, కాలనీవాసులు నగర పంచా యతీ కార్యాలయం చేరుకుని ఆందోళనకు దిగారు. స్థలాలు పొందిన 18మందికి పట్టాలు ఇవ్వాలని టీడీపీ నాయకులు అధికారులతో వాదనకు దిగారు. 18 పట్టాలు కనిపించడం లేదని నగర పంచాయతీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ రాజాకుళ్ళాయప్ప తెలిపారు. ఇలా ఉద యం నుంచి సాయంత్రం వరకు హైడ్రామా నడిచింది.