పర్యావరణాన్ని పరిరక్షించండి
ABN , Publish Date - Oct 06 , 2026 | 11:32 PM
పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ డా.పి.కృష్ణయ్య అన్నారు.
కాలుష్య నియంత్రణను పకడ్బందీగా అమలు చేయండి
స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి
రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కృష్ణయ్య
ఓర్వకల్లు, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల్లో ఉత్పత్తి ప్రక్రియతో పాటు పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) చైర్మన్ డా.పి.కృష్ణయ్య అన్నారు. మంగళవారం ఓర్వకల్లు మండలంలోని గుట్టపాడు గ్రామ సమీ పంలో ఉన్న జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంటును ఆయన పరిశీలించారు. కాలుష్య నియం త్రణకు తీసుకుంటున్న చర్యలు, మొక్కల పెంపకం, ఉద్యోగాల కల్పన తదితర అంశాలపై కలెక్టర్ ఏ.సిరితో కలిసి ఆయన సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ పరిశ్రమల్లో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. స్థానిక ప్రజల ఆద రణ, సహకారం పొందేలా పరిశ్రమల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఉద్యోగులు, కార్మికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు, క్రమబద్దమైన భద్రతా తనిఖీలు, మార్ట్‌డ్రిల్స్ నిరంతరం నిర్వహించా లన్నారు. పరిశ్రమ ప్రాంగణాల్లో పచ్చదనం పెంచేందుకు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చైర్మన్ యజమాన్యాన్ని ఆదేశించారు. కలెక్టర్ ఏ.సిరి మాట్లాడుతూ పరిశ్ర మలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకు రావాలని, వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. చైర్మన్, కలెక్టర్ పరిశ్రమల ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జైరాజ్ ఇస్పాత్ ఎండీ బోయంక, కర్నూలు ఆర్డీవో సందీప్ కుమార్, ఏపీఐఐసీ జనరల్ మేనేజర్ మధుసూదన్‌రెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిషోర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ అధికారి సంజీవరాజు, జైరాజ్ ఇస్పాత్ ప్రతి నిధులు పాల్గొన్నారు.
యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వండి
నైపుణ్యం అవసరమైన ఉద్యోగాల కోసం యువతకు పరిశ్రమల ఆధ్వర్యంలో శిక్షణ అందించి ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఏపీపీసీబీ చైర్మన్ కృష్ణయ్య అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన రిలయన్స్ కన్జ్యూమర్స్ ప్రాడక్ట్ లిమెటెడ్ ప్లాంటును ఆయన పరిశీలించారు. కాలుష్య నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ఉపాది కల్పనపై కలెక్టర్‌తో కలిసి ఆయన సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కృష్ణయ్య మాట్లాడుతూ మామిడి జ్యూస్ తయారీలో తోటాపురి ఆల్పెన్సో రకాలతో పాటు స్థానికంగా విస్తారంగా లభించే బంగినపల్లి మామిడిని వినియోగించే అంశాలను పరి శీలించాలని రిలయన్స్ యాజమాన్యాన్ని సూచించారు. స్థానిక రైతుల నుంచి బంగినపల్లి మామిడిని పెద్దఎత్తున సేకరించి దాని రుచిని పరిగణనలోకి తీసుకుని ఆల్ఫోనోకు ప్రత్యా మ్నాయంగా, మిశ్రమంగా వినియోగించే అంశాలపై పరిశోధన చేపట్టాలన్నారు. పానీ యాల తయారీ నాణ్యత, శుభ్రత, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ నైపుణ్యం లేకపోవడం యువతకు అడ్డంకిగా మారకుండా పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించాలని యాజమాన్య ప్రతినిధులకు సూచించారు. రిలయన్స్ ప్లాంటులో తయారవుతున్న పానీయాల విధానాన్ని పరిశీలించారు.