Share News

పర్యావరణాన్ని కాపాడాలి

ABN , Publish Date - Jun 01 , 2026 | 12:08 AM

పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ ముందుకు రావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు.

పర్యావరణాన్ని కాపాడాలి
పోస్టర్‌ను విడుదల చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

బనగానపల్లె, మే 31(ఆంధ్రజ్యోతి): పర్యావరణాన్ని కాపాడటానికి అందరూ ముందుకు రావాలని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా ఏపీ పొల్యూషన్‌ బోర్డు అధికా రులు మంత్రి క్యాంపు కార్యాలయంలో పర్యావరణ పరిరక్షణ దినోత్స వం-2026 పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. పచ్చదనం పెంచేలా బనగానపల్లె బైపాస్‌కు ఇరువైపులా 500 మొక్కలు నాటి సంరక్షిం చనున్నట్లు మంత్రి బీసీ తెలిపారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ కాలుష్యం నియంత్రణ, ప్లాస్టిక్‌ వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి సూచించారు. ప్రతి వ్యక్తి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని మంత్రి పిలుపునిచ్చారు. జూన్‌ 1వతేదీ సోమవారం నుంచి ఏపీ కాలుష్య నియంత్రణమండలి నంద్యాల విభాగం ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులు తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 12:08 AM