జడ్పీలో పదోన్నతులు
ABN , Publish Date - Apr 24 , 2026 | 11:12 PM
జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పరిపాలన అధికారి, సీనియర్ అసిస్టెంట్లకలలు పదోన్నతులు కల్పిస్తూ జిల్లా పరిషత్ సీఈవో జీవీ. రమణారెడ్డి ఉత్త ర్వులు జారీ చేశారు.
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్ పరిధిలో పని చేస్తున్న పరిపాలన అధికారి, సీనియర్ అసిస్టెంట్లకలలు పదోన్నతులు కల్పిస్తూ జిల్లా పరిషత్ సీఈవో జీవీ. రమణారెడ్డి ఉత్త ర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆస్పరి మండల పరిపాలన అధి కారిగా పని చేస్తున్న జి. స్వర్ణలతకు కౌతాళం ఎంపీడీవోగా, డోన్ మండల కార్యా లయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న సి. కాశినాథ్ ప్రసాద్‌ను కర్నూలు మండల పరిపాలన అధికారిగా నియమించారు. ఈ మేరకు జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి చేతుల మీదుగా వీరు పోస్టింగ్ ఆర్డర్లు అందుకున్నారు.