Share News

హెడ్‌ నర్సులకు పదోన్నతులు

ABN , Publish Date - Jan 02 , 2026 | 11:28 PM

వైద్య ఆరోగ్యశాఖ జోనల్‌ పరిధిలో పని చేస్తున్న సీనియర్‌ హెడ్‌ నర్సులకు నర్సింగ్‌ సూపరింటెండెంట్లు గ్రేడ్‌-2లుగా పదోన్నతి లభించింది.

హెడ్‌ నర్సులకు పదోన్నతులు
జీజీహెచ్‌ గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ శ్రీగౌరికి ఉత్తర్వులు అందిస్తున్న కడప ఆర్‌డీ

జీజీహెచ్‌ గ్రేడ్‌-2 సూపరింటెండెంట్‌గా శ్రీగౌరి

కర్నూలు హాస్పిటల్‌, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖ జోనల్‌ పరిధిలో పని చేస్తున్న సీనియర్‌ హెడ్‌ నర్సులకు నర్సింగ్‌ సూపరింటెండెంట్లు గ్రేడ్‌-2లుగా పదోన్నతి లభించింది. శుక్రవారం కడప రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో 10మంది హెడ్‌ నర్సులకు పదోన్నతులపై కౌన్సెలింగ్‌ను కడప ఆర్‌డీ డాక్టర్‌ రామగిడ్డయ్య నిర్వహించారు. కర్నూలు జీజీహెచ్‌లో పని చేస్తున్న సీనియర్‌ హెడ్‌ నర్సు సి.శ్రీగౌరికి గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌గా పదోన్నతి కల్పించి కర్నూలు జీజీహెచ్‌కు పోస్టింగ్‌ ఇస్తూ ఆదేశాలు జారీచేశారు. తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్‌కు చెందిన ఎం.వరలక్ష్మిని కర్నూలు ఆర్‌ఈహెచ్‌కు, అనంతపురం జీజీహెచ్‌కు చెందిన ఎం.గంగామయిని స్టేట్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పోస్టింగ్‌ వేశారు. కడప జీజీహెచ్‌కు చెందిన ప్రెసిల్లాను నంద్యాల జీజీహెచ్‌ గ్రేడ్‌-2 నర్సింగ్‌ సూపరింటెండెంట్‌గా నియమించారు. ఏపీ గవర్నమెంటు నర్సింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్‌.రాధమ్మ, కర్నూలు జిల్లా అద్యక్ష కార్యదర్శులు ఎం.లీలావతి, సి.బంగారి, కోశాధికారి ఎన్‌.లక్ష్మినరసమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jan 02 , 2026 | 11:28 PM