Share News

హామీలను అమలు చేయాలి : ఎస్టీయూ

ABN , Publish Date - Feb 14 , 2026 | 12:06 AM

ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది.

హామీలను అమలు చేయాలి : ఎస్టీయూ
మాట్లాడుతున్న ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు టీకే జనార్దన

కర్నూలు ఎడ్యుకేషన, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా శాఖ డిమాండ్‌ చేసింది. ఎస్టీయూ రాష్ట్ర సంఘం ఇచ్చిన ధర్నా పిలుపు మేరకు శుక్రవారం స్థానిక జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఎస్టీయూ నాయకులు ధర్నా చేశారు. ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు టీకే జనా ర్దన, రాష్ట్ర సహాధ్యక్షులు ఎస్‌.గోకారి, రాష్ట్ర పూర్వపు ప్రధాన కార్యదర్శి హెచ. తిమ్మన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి 30 శాతం ఐఆర్‌ను ప్రకటిం చాలన్నారు. సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాల ని కోరారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీని వెంటనే మంజూరు చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు అడివన్న, రాష్ట్ర ఆర్థిక కమిటీ సభ్యులు మహదేవప్ప, జిల్లా ఆర్థిక కార్యదర్శి శ్రీధర్‌, జిల్లా ఉపాధ్యాయవాణీ కన్వీనర్‌ బీసీ నరసింహులు, నాగరాజు, డి.నాగరాజు మంజుల, సుజాత పాల్గొన్నారు.

Updated Date - Feb 14 , 2026 | 12:06 AM