హామీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Feb 23 , 2026 | 11:54 PM
గతంలో 42 రోజులుగా చేసిన సమ్మె సందర్బంగా ఇచ్చిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయా లకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు పి.నిర్మల డిమాండ్ చేశారు.
ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీల నిరాహార దీక్షలు
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): గతంలో 42 రోజులుగా చేసిన సమ్మె సందర్బంగా ఇచ్చిన అంగన్‌వాడీ టీచర్లు, ఆయా లకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర నాయకురాలు పి.నిర్మల డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగం గా సీఐటీయూ, ఏఐటీయూసీ అనుబంధ అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హె ల్పర్ యూనియన్ల ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష లు నిర్వహించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలన్నారు. అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని ఎన్ని కల్లో నాయకులు హమీ ఇచ్చారని గుర్తు చేశారు. ఖాళీగా ఉన్న 164 సూపర్ వైజ్ పోస్టులను అంగన్‌వాడీలతోనే భర్తీ చేయాలని, మినీ అంగన్‌వాడీ సెంటర్లను మెయిన్ అంగన్‌వాడీ సెంటర్లుగా ప్రమోట్ చేయాలన్నారు. ఈనెల 27 వరకు దశలవారీ ఆందోళన, అనంతరం మార్చి 2న చలో విజయవాడ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీ యూసీ, సీఐటీయూ జిల్లా కార్యదర్శులు ఎస్.మునెప్ప, ఎండి. అంజి బాబు, కోశాధికారి ఎం.గోపాల్, విజయ్, రామక్రిష్ణ, రామాంజనేయులు పాల్గొన్నారు.