మాజీ ఎమ్మెల్యే గఫూర్‌కు ప్రముఖుల పరామర్శ
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:53 PM
కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత ఎంఏ గఫూర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గఫూర్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల దంపతుల కుమారుడు పీవీ కిరణ్(41) అమెరికాలో గుండెపోటుతో కన్నుమూశారు. కుమారుడి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన గఫూర్, నిర్మల దంపతులను పరువురు ప్రముఖులు పరామర్శించి ఓదార్చారు.
కర్నూలు అర్బన్/కల్లూరు, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత ఎంఏ గఫూర్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గఫూర్, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు పి.నిర్మల దంపతుల కుమారుడు పీవీ కిరణ్(41) అమెరికాలో గుండెపోటుతో కన్నుమూశారు. కుమారుడి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయిన గఫూర్, నిర్మల దంపతులను పరువురు ప్రముఖులు పరామర్శించి ఓదార్చారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, గౌరు వెంకటరెడ్డి దంపతులు, టీడీపీ రాష్ట్ర నాయకులు వాహబ్, సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు గౌస్ దేశాయి, గిడ్డయ్య, సీపీఎం సీనియర్ నాయకుడు రాధాకృష్ణ సహా వివిధ ప్రజా సంఘాల నాయకులు, విద్యా సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు కలసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కిరణ్ మృతికి ఆవాజ్ కమిటీ నగర అధ్యక్ష, కార్యదర్శులు పి.ఇక్బాల్ హుస్సేన్, ఎస్‌ఎండీ షరీ్‌ఫలో ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. అదే విధంగా ఐద్వా నాయకులు సంతాపం తెలిపారు.
మంత్రి టీజీ భరత్ దిగ్ర్భాంతి: గఫూర్ కుమారుడు కిరణ్ మృతికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మంత్రి గఫూర్‌తో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. చిన్న వయస్సులోనే కుమారుడిని కోల్పొవడం ఎంతో బాధకరమన్నారు. కిరణ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, గఫూర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.