Share News

టీడీపీతోనే ‘సీమ’లో ప్రాజెక్టులు

ABN , Publish Date - Apr 23 , 2026 | 11:38 PM

రాయలసీమలో తెలుగుదేశం పార్టీతోనే ప్రాజెక్టులకు పునాది పడిందని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షు రాలు గౌరు చరితారెడ్డి అన్నారు.

టీడీపీతోనే ‘సీమ’లో ప్రాజెక్టులు
మాట్లాడుతున్న గౌరు చరితారెడ్డి

టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షురాలు గౌరు చరితారెడ్డి

కల్లూరు, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాయలసీమలో తెలుగుదేశం పార్టీతోనే ప్రాజెక్టులకు పునాది పడిందని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షు రాలు గౌరు చరితారెడ్డి అన్నారు. గురువారం కర్నూలులోని తన స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై వైసీపీ నాయకులు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ ప్రాంత ప్రజలు, రైతుల శ్రేయస్సు, సంక్షేమం కోసం టీడీపీ వ్యవస్థాపకులు ఎన్‌టీఆర్‌ ఆహర్నిశలు కృషి చేయగా దానికి సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు. తెలుగుగంగా, హంద్రీనీవా సుజల స్రవంతి, గాలేరునగరి, వెలుగోడు, ఎస్‌ఆర్‌బీసీ ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే వచ్చాయన్నారు. తుంగభద్ర గేటు పాడైతే యుద్ధ ప్రాతిపదికన రన్నింగ్‌ వాటర్‌లోనే 5రోజుల్లో గేటు ఏర్పాటుచేసి 40 టీఎంసీలు నిలబెట్టిన ఘనత సీఎం చంద్రబాబుదన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి ప్రజల ప్రాణాలను హరించిన నిజమైన రాయలసీమ ద్రోహులు వైసీపీ నాయ కులే అని మండిపడ్డారు. పెరుగు పురుషోత్తంరెడ్డి, కాసాని మహేష్‌గౌడ్‌, ప్రభాకర్‌యాదవ్‌, డి.శేఖర్‌, ఎన్వీ.రామకృష్ణ, మేకల శేషన్న పాల్గొన్నారు.

వైసీపీ దుష్ప్రచారం మానుకోవాలి

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై వైసీపీ నాయకులు దుష్ప్రచారం మానుకోవాలని టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ అధికార ప్రతినిధి చిన్నమా రెన్న అన్నారు. వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్ర బాబుపై చేసిన అసత్య ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

Updated Date - Apr 23 , 2026 | 11:38 PM