ప్రణాళికలతోనే ప్రగతిని సాధించాలి
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:52 AM
గ్రామాల్లో ప్రణాళికలతోనే ప్రగతిని సాధించొచ్చని జడ్పీ సీఈవో జి.నాసరరెడ్డి అన్నారు.
కర్నూలు న్యూసిటీ, ఫిబ్రవరి 26 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో ప్రణాళికలతోనే ప్రగతిని సాధించొచ్చని జడ్పీ సీఈవో జి.నాసరరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం (డీపీఆ ర్‌సీ)లో అన్నిశాఖల జిల్లాస్థాయి అదికారులకు గ్రామ పంచా యతీ అభివృద్ది ప్రణాళిక 2026-27పై ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పరి పాలనలో గ్రామస్థాయి నుంచి ప్రజాభాగస్వామ్యం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో 73వ రా జ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు స్వయం ప్రతిపత్తిని చట్టబద్ధ తను కల్పించి స్థాన ప్రభు త్వాలుగా తీర్చిదిద్దామన్నారు. జిల్లా నుంచి వచ్చే సంవత్సరం జాతీయ స్థాయిలో బహుమానం పొందే విధంగా ఉత్తమ ప్రగతిని కనబరచాలని ఆయన ఆశించారు. ఆదోని డీఎల్‌డీవో బాలక్రిష్ణారెడ్డి, ఆదోని, కర్నూలు డీఎల్‌పీవోలు తిమ్మక్క, లక్ష్మీ, డీపీఆర్‌సీ జిల్లా శిక్షణ మేనేజర్ బి.గిడ్డేష్, సీనియర్ అసిస్టెంట్, వేణుగోపాల్, టీవోటీలు పాల్గొన్నారు.