ఏఈ లేక సమస్యలు తీరక..
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:17 AM
కొలిమిగుండ్లలోని విద్యుత్ సబ్‌స్టేషన్
విద్యుత్ ఏఈ, లైన్ ఇన్స్‌పెక్టర్ పోస్టులు ఖాళీ
వినియోగదారుల అవస్థలు..
కొలిమిగుండ్ల, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): c. పర్రిశ్రమల కనెక్షన్లు 500, వ్యవసాయ కనెక్షన్లు 2300, గృహాల కనెక్షన్లు 13,400 సర్వీసులు ఉన్నాయి. వీరి నుంచి ఏదైనా సమస్య ఉన్నా పరిష్కరించేవారు లేరని వినియోగదారులు, పరిశ్రమల యజమానులు ఆరోపిస్తున్నారు. మండలంలో మొత్తం 5 సబ్‌స్టేషన్లు ఉండగా, 3 లైన్‌మెన్లు, 3 అసిస్టెంట్ లైన్‌మెన్లు, 13మంది జెఎల్‌ఎంలు మొత్తం 19మంది పనిచేస్తున్నారు. అయితే వారిపై పర్యవే లేకపోవడంతో ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
సబ్ ఇంజనీరు మాత్రమే..
మండల కేంద్రంతో పాటు, కనకాద్రిపల్లె, చింతాయపల్లె, అంకిరెడ్డిపల్లె, తిమ్మనాయినిపేట గ్రామాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. ఒక్క సబ్ ఇంజనీరు మాత్రమే విధులు నిర్వర్తిస్తుండటంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు. సరఫరాలో అంతరాయం ఏర్పడినా, ఇతర సమస్యలు వచ్చినా గంటలు, రోజుల తరబడి పరిష్కారం కావడం లేదు.
పరిశ్రమల యజమానుల అవస్థలు
మండలంలో నాపరాళ్ల గనులు, పాలిషింగ్ పరిశ్రమలు సుమారుగా 500 వరకు ఉన్నాయి. విద్యుత్ శాఖకు రూ.కోట్లలో ఆదాయం వస్తున్నా సమస్య వచ్చినప్పుడు సిబ్బంది వెంటనే స్పండించడం లేదని యజమానులు వాపోతున్నారు. ప్రజా ప్రతినిధులు, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి ఏఈ, లైన్ ఇన్‌స్పెక్టర్లను నియమించి మెరుగైన సేవలు అందించాలని వినియోగదారులు కోరుతున్నారు.