సమస్యలను వేగంగా పరిష్కరించాలి
ABN , Publish Date - May 11 , 2026 | 11:57 PM
ప్రజా సమస్యలను నిర్ణీత గడువు (ఎస్‌ఎల్‌ఏ) దాటకుండా వేగంగా పరిష్కరించాలని కలె క్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు.
కర్నూలు కలెక్టరేట్, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను నిర్ణీత గడువు (ఎస్‌ఎల్‌ఏ) దాటకుండా వేగంగా పరిష్కరించాలని కలె క్టర్ డా.ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సున యన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్ర మం లో భాగంగా కలెక్టర్ ప్రజల నుంచి సమస్యల వినతులను స్వీకరిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులపై అధి కారులు ప్రత్యేక దృష్టి సారించి ప్రతి దరఖాస్తును పరిశీలించి పెండింగ్‌లో లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధి కారులు స్వయంగా దరఖాస్తుదారులతో మాట్లాడి వారి సమస్యల పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. రీఓపెన్ అయిన అర్జీలపై ప్రత్యే క దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని సూచించారు. ఎట్ టూ వ్యూలో అర్జీలను ఎప్పటికప్పుడు చూడాలన్నారు. సీఎంవో కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, ఇన్‌చార్జి డీఆర్వో చిరంజీవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సునీత, రామసుబ్బయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.