Share News

సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 20 , 2026 | 12:14 AM

ప్రజల సమస్యలను అధికారులు సామరస్యంగా పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమి షనర్‌ చల్లా ఓబులేసు ఆదేశిం చారు

సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలి
ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న కమిషనర్‌ చల్లా ఓబులేసు

నగర పాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు

కర్నూలు న్యూసిటీ, జూలై 19(ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యలను అధికారులు సామరస్యంగా పరిష్కరించాలని నగర పాలక సంస్థ కమి షనర్‌ చల్లా ఓబులేసు ఆదేశిం చారు. ఆదివారం ఆయన గీతా ముఖర్జీన గర్‌ రోడ్డు నెంబర్‌ 5లో కొన్ని ఏళ్లుగా అపరిష్కృతగా ఉన్న రహదారి సమ స్య ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్‌ విభాగ అధికారుల సమన్వయంతో బాధితుడితో మాట్లాడి రహదారి నిర్మాణాన్ని చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అను రాగ్‌ ఎస్టేట్‌లోని పార్కు స్థలం, రహదారిని కమిషనర్‌ పరిశీలించారు. పార్కు స్థలానికి ప్రహరీ నిర్మాణం, నడకబాట, విద్యుత దీపాలు, బెంచీ లు ఏర్పాటుకు ప్రతి పాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశిం చారు. కమిషనర్‌ మాట్లాడుతూ మౌలిక వసతుల పనులకే తొలి ప్రాధాన్యం ఇస్తున్నామని, నిధుల లభ్యతను బట్టి ప్రాధాన్యత క్రమంలో ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తాన్నామన్నారు. కార్యక్రమంలో డీఈఈ శ్రీనివాసన, శానిటరీ ఇనస్పెపెక్టర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2026 | 12:14 AM