Share News

పరిష్కారం కాని సమస్యలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 11:58 PM

రాష్ట్రంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించుకొని రెవెన్యూ క్లినిక్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం అవి నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. రెవెన్యూ క్లినిక్‌లు అనేక చోట్ల లక్ష్యాన్ని నెర వేర్చడంలో విఫలమవుతున్నాయి.

పరిష్కారం కాని సమస్యలు
కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌

సతమతమవుతున్న అర్జీదారులు

పట్టించుకోని అధికారులు

నిర్లక్ష్యపు రెవెన్యూ క్లినిక్‌

నంద్యాల నూనెపల్లి, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించుకొని రెవెన్యూ క్లినిక్స్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం అవి నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతున్నాయి. రెవెన్యూ క్లినిక్‌లు అనేక చోట్ల లక్ష్యాన్ని నెర వేర్చడంలో విఫలమవుతున్నాయి. సమస్యల పరిష్కారం కోసం వచ్చే ప్రజలకు ఇక్కడ నిరాశే ఎదురౌతోంది. వారాలు, నెలలు గడుస్తున్నా సరైన స్పందన లేక అర్జీదారులు ఇబ్బందులు పడుతున్నారు. నంద్యాల జిల్లాలో ఇప్పటివరకు రెవెన్యూ క్లినిక్‌లో అందించిన అర్జీల్లో దాదాపు 40శాతం అర్జీదారులకు మాత్రమే పరిష్కారం దొరకడం అధికారుల నిర ్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. అధికారులు అసలు పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.

ఉన్నతాధికారులను లెక్కచేయడం లేదు

రెవెన్యూ క్లినిక్స్‌లో ఎక్కువగా అడంగల్‌ సవరణలు, చుక్కల భూములు, 22ఏ సమస్యలు, అసైన్డ్‌ భూములు, భూ ఆక్రమణలు, సర్వే, రీ-సర్వే సమస్యలు, రెవెన్యూ ఆర్వోఆర్‌ అం శాలు, పాస్‌బుక్‌ సమస్యలు, వారసత్వ నమోదు, భూ ఆన్‌లైన్‌ సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పిస్తున్నారు. జిల్లా కేంద్రానికి వచ్చే అర్జీలను ఉన్నతాధికారులు పరిశీలించి సంబం ధిత ఆర్డీవో, తహసీల్దారు, వీఆర్వోకు అర్జీ విషయంపై విచారణ జరిపి చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశిస్తున్నారు. కొందరు తహసీల్దార్లు, వీఆర్వోలు మాత్రం ఉన్న తాధికారులను మాటలను సైతం లెక్క చేయకుండా ఆఅర్జీలను పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోని సమస్యలు పరిష్కా రమయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఎన్నిసార్లు అర్జీలిచ్చినా..

మాది పాణ్యం మండలంలోని భూపనపాడు గ్రామం. సర్వే నంబరు 14లో 1.80 సెంట్ల పొలం ఉంది. మా భూమిని ఆక్రమించేందుకు దాదాపు 15 ఏళ్ల కిందట ఆన్‌లైన్‌లో నుంచి తొలగించారు. సంబంధిత భూమి పట్టా కూడా మావద్దే ఉంది. ఆన్‌లైన్‌లో ఎక్కించమని ఎన్నిసార్లు ఇచ్చినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. రెవెన్యూ క్లినిక్‌లో కూడా పలుసార్లు అర్జీ ఇచ్చాం.. అయినా పట్టించుకోవడం లేదు. దేవభూషణం, భూపనపాడు

పబ్లిక్‌ రస్తాను కబ్జా చేశారు

ఆత్మకూరులోని పెద్ద పీర్ల వీఽధికి వెళ్లే పబ్లిక్‌ రస్తాను పలువురు కబ్జా చేశారు. ఈ విషయంపై విచారణ జరిపి రస్తాకు అసిస్‌మెంట్‌ నెంబరు సృష్టించిన వారిపై, రిజిస్టర్‌ చేసిన వారిపై చర్యలు తీసుకొని రస్తా అక్రమణకు గురికాకుండా చూడాలని కోరుతున్నాం. సయ్యద్‌ బషీర్‌ అహ్మద్‌, ఆత్మకూరు

Updated Date - Apr 19 , 2026 | 11:58 PM