Share News

గడువులోపు సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Feb 23 , 2026 | 11:52 PM

అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ సిరి అదికారులను ఆదేశించారు.

గడువులోపు సమస్యలను పరిష్కరించాలి
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌

కలెక్టర్‌ డాక్టర్‌ సిరి

కర్నూలు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్‌ సిరి అదికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ సునయన ఆడిటోరియంలో జేసీ నూరుల్‌ ఖమర్‌తో కలిసి ప్రజా పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్‌ అర్జీలను నాణ్యతతో, నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా బీయాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లకూడదని, అర్జీలు రీఓపెన్‌ కాకూడదని, దరఖాస్తులపై ఎండార్సెమెంట్‌ స్పష్టంగా ఇవ్వాలన్నారు. డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 11:52 PM