సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 29 , 2026 | 11:35 PM
సమస్యలను ఎప్పడికప్పుడు పరిష్కరించాలని డీఆర్వో వెంకట నారాయణమ్మ సంబంధిత అధికారులను ఆదేశించారు.
డీఆర్వో వెంకట నారాయణమ్మ
కర్నూలు కలెక్టరేట్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): సమస్యలను ఎప్పడికప్పుడు పరిష్కరించాలని డీఆర్వో వెంకట నారాయణమ్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్వో ప్రజల నుంచి వివిద సమస్యలకు సంబంధించిన వినతులు స్వీకరించారు. ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ప్రధాన బాధత అని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) ద్వారా అందుతున్న ప్రతి అర్జీని అధికారులు అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి నిర్ణీత సేవా ప్రమాణాల (ఎస్‌ఎల్‌ఎ) గడువులోపు నాణ్యమైన పరిష్కారం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివప్రసాద్ రెడ్డి, అనూరాధ, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.