Share News

వెటర్నరీ పాలిటెక్నిక్‌లో సమస్యలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 12:35 AM

ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నికల్‌ కళాశాల సమస్యలకు నిలయంగా మారింది. మండలంలోని హుసేనాపురం గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నికల్‌ కళాశాల ఉంది. దాదాపు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలో వసతులు సరిగా లేకపోవడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

వెటర్నరీ పాలిటెక్నిక్‌లో సమస్యలు
వెటర్నరీ పాలిటెక్నిక్‌

తాగునీటి వసతి, ప్రహరీ లేదు ఫ దుర్వాసన కొడుతున్న మరుగుదొడ్లు

ప్యాపిలి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నికల్‌ కళాశాల సమస్యలకు నిలయంగా మారింది. మండలంలోని హుసేనాపురం గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నికల్‌ కళాశాల ఉంది. దాదాపు 40 మంది విద్యార్థులు చదువుతున్నారు. కళాశాలలో వసతులు సరిగా లేకపోవడంతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

తాగునీరు లేక ఇబ్బందులు..

కళాశాలకు సంబంధించిన బోరు అడుగంటిపోయింది. దీంతో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఆ నీరు సరిపోవడం లేదు. అలాగే నిర్వహణ లేకపోవడంతో టాయిలెట్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వెళ్లలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రహరీ లేక ఇబ్బంది

పాలిటెక్నిక్‌ కళాశాల కొండ ప్రాంతంలో ఉంది. భవనానికి ప్రహరీ నిర్మించకపోవంతో విషపురుగులు, జంతువులు లోపలికి వస్తున్నాయని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Updated Date - Oct 06 , 2026 | 12:35 AM