Share News

సమస్యల బడి

ABN , Publish Date - May 29 , 2026 | 11:53 PM

మండలంలోని బెలుం గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాలలో సమస్యలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో వంటగది నిర్మాణం నిలిచిపోవడంతో అపరిశుభ్ర వాతావరణంలోనే వంటలు చేస్తున్నారు.

సమస్యల బడి
క్రీడా మైదానంలో బండరాళ్లు

బెలుం జడ్పీ ఉన్నత పాఠశాల దుస్థితి

పూర్తికాని వంటగది, మైదానంలో బండరాళ్లు

కొలిమిగుండ్ల, మే 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బెలుం గ్రామం జడ్పీ ఉన్నత పాఠశాలలో సమస్యలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలో వంటగది నిర్మాణం నిలిచిపోవడంతో అపరిశుభ్ర వాతావరణంలోనే వంటలు చేస్తున్నారు. గత వైసీపీ హయాంలో వంటగది నిర్మాణానికి నిదులు మంజూరు చేసినా, అధికారుల అలసత్వం కారణంగా పూర్తికాలేదు.

ఆవరణలో బండరాళ్లు

పాఠశాలలో మైదానం ఉన్నా, బండరాళ్లతో నిండిఉండటంతో విద్యార్థులు క్రీడల్లో పాల్గొనే పరిస్థితి లేదు. పాఠశాలకు ప్రహరీ కూడా లేదు. పంచాయతీ, విద్యాశాఖ అధికారులు పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోపు మైదానాన్ని శుభ్రం చేయంచాలని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - May 29 , 2026 | 11:53 PM