కాలనీ.. కహానీ
ABN , Publish Date - Sep 08 , 2026 | 11:36 PM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ సమీపంలోని బనగానపల్లె రహదారి వద్ద జగనన్నకాలనీ ఏర్పాటు చేశారు. అయితే కాలనీనీ అభివృద్ధి చేయకుండానే కేవలం ఇళ్లు నిర్మించి వదిలేశారు. ఇక్కడ ఏ,బీ,సీ,డీ,ఈ బ్లాక్‌లలో సుమారు వంద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
బేతంచెర్ల జగనన్న కాలనీలో సమస్యలు
సీసీ రోడ్లు, వీధి లైట్లు లేవు
బేతంచెర్ల, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ సమీపంలోని బనగానపల్లె రహదారి వద్ద జగనన్నకాలనీ ఏర్పాటు చేశారు. అయితే కాలనీనీ అభివృద్ధి చేయకుండానే కేవలం ఇళ్లు నిర్మించి వదిలేశారు. ఇక్కడ ఏ,బీ,సీ,డీ,ఈ బ్లాక్‌లలో సుమారు వంద కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
కనీస సదుపాయాలు లేవు
కాలనీలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారికి ఇరువైపులా ముళ్లకంప పెరిగి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ప్రజలు వాపోతున్నారు. రోడ్లు లేకపోవడంతో చిన్నారులు, వృద్ధులు, గర్భిణులు అవస్థలు పడుతున్నారు. సీసీ రోడ్లు నిర్మించాలని పలుమార్లు అధికారులను కోరినా స్పందించడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీధిలైట్లు లేకపోవడంతో రాత్రిళ్లు అంధకారంతో బయటకు రావడానికే ప్రజలు భయపడుతున్నారు. కాలనీ ప్రవేశద్వారం వద్ద వీధిలైట్లు లేకపోవడంతో ఆకతాయిలు మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాగునీటి సమస్యతో సతమతం
కాలనీలో తాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. సి. బ్లాక్‌లో వారం నుంచి మోటారు పనిచేయడం లేదని, భూగర్భజలాలు తగ్గిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపిస్తున్నారు. పలుమార్లు పీజిఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేసినా స్పందన లేదంటున్నారు. నీటితొట్లకు కప్పులు లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
సీసీ రోడ్లు నిర్మించాలి
జగనన్న కాలనీలో సీసీ రోడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వర్షం కురిసినా రహదారిపై నడవాలంటేనే ఇబ్బందిగా ఉంది. వర్షపునీరు రోడ్లపై నిలిచి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అధికారులు సీసీ రోడ్లు నిర్మించాలి. - నాగేశ్వరమ్మ, కాలనీవాసి
తాగునీటి సమస్యను పరిష్కరించాలి
కాలనీలోని సీ, డీ సెక్షన్లలో తాగునీటి సమస్య ఉంది. ఇప్పటికే పలుమార్లు అధికారులకు విన్నవించాం. అలాగే వీధిలైట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యల ను పరిష్కరించాలి. - మద్దమ్మ