సమస్యల కాలనీ
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:28 AM
మండలకేంద్రంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో గత ప్రభుత్వం జ.గననన కాలనీ పేరుతో పక్కా గృహాలు నిర్మించింది. ఎంతా ఆర్భాటంగా కాలనీని ఏర్పాటుచేసి, కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
కొలిమిగుండ్ల జగనన్న కాలనీవాసుల అవస్థలు
రోడ్డు లేదు, తాగునీటి సమస్య, వీధిదీపాలు లేక ఇబ్బంది
కొలిమిగుండ్ల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): మండలకేంద్రంలోని కస్తూర్బా పాఠశాల సమీపంలో గత ప్రభుత్వం జ.గననన కాలనీ పేరుతో పక్కా గృహాలు నిర్మించింది. ఎంతా ఆర్భాటంగా కాలనీని ఏర్పాటుచేసి, కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు.
రహదారి లేక ఇబ్బందులు
కాలనీలో ప్రస్తుతం వంద కుటుంబాలు నివాసముంటున్నాయి. కాలనీకి వెళ్లేందుకు రహదారి కూడా సరిగాలేదు. ఈ కాలనీలో కొలిమిగుండ్ల, ఇటిక్యాల, చింతలాయపల్లె గ్రామాలకు దాదాపు 500మందికి ఇక్కడ గృహాలు కేటాయించారు. అయితే కాలనీకి వెళ్లేందుకు రహదారి నిర్మించలేదు. రాళ్లుతేలిన రహదారిపై నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే తాగునీటి సౌకర్యం, వీధిలైట్లు లేవు. రాత్రిళ్లు చీకటితో బయటకు రావాలంటేనే ఇబ్బందిగా ఉందని కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. ఇక వర్షం కురిస్తే బయటకు రాలకున్నామని, అధికారులు స్పందించి కాలనీని అభివృద్ధి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.